హిందీ వెర్షన్ బాహుబలి : 10 రోజుల్లో 60 కోట్లు

baahubali11
సౌత్ ఇండియాలోని నాలుగు భాషలు మరియు హిందీలో కలిపి రిలీజ్ అయ్యే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అలా 10 రోజుల కిత్రం 4 భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడమే కాకుండా కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ సృష్టించడంలోనూ తన సత్తా చాటుకుంటోంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ట్రేడ్ వర్గాలు ముక్కున వేలేసుకునేలా ఈ సినిమా కలెక్షన్స్ వసూలు చేస్తోంది.

మొదటి వారం బాహుబలి ఇరు రాష్ట్రాల్లో కలుపుకొని సుమారు 61 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. దీనికి దీటుగా హిందీ వెర్షన్ ఫస్ట్ వీక్ లో మొత్తంగా 46 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. దీనికి ఏమాత్రం తగ్గకుండా సెకండ్ వీకెండ్ లో కూడా సూపర్బ్ కలెక్షన్స్ ని నమోదు చేసింది. మొత్తం 10 రోజుల్లో ఒక్క హిందీ వెర్షన్ లోనే 60 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. హిందీ డబ్బింగ్ సినిమాల విషయంలో బాహుబలి ఆల్ టైం రికార్డ్ ని సృష్టించింది.

వారం కలెక్షన్స్ (షేర్)
శుక్ర వారం  5.15 కోట్లు
శని వారం 7.09 కోట్లు
ఆది వారం 10.11 కోట్లు
సోమవారం 6.10 కోట్లు
మంగళవారం 6.15 కోట్లు
బుధవారం 6.05 కోట్లు
గురువారం 6.12 కోట్లు
శుక్రవారం 3.25 కోట్లు
శనివారం 4.70 కోట్లు
ఆదివారం 5.40 కోట్లు
మొత్తం : 60.12 కోట్లు
Exit mobile version