50 రోజుల క్రితం రిలీజ్ అయిన ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించిన రానా దగ్గుబాటికి నేషనల్ వైడ్ గా భారీ గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో రానా బాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్ అయ్యాడు. ప్రసతుతం ఢిల్లీలో జరుగుతున్న లాక్మే ఫాషన్ వీక్ లో కూడా రానా పాల్గొన్నాడు. అక్కడ జరిగిన ప్రెస్ కాన్ఫిరెన్స్ లో బాహుబలి సక్సెస్ గురించి మాట్లాడుతూ ‘బాహుబలి సినిమా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఈ రేంజ్ లో పేరు వస్తుందని ఊహించలేదని’ రానా తెలిపాడు.
ఇది కాకుండా రానా బాహుబలి ఇంటర్నేషనల్ రిలీజ్ ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోంది. కొన్ని ఫారిన్ కంట్రీస్ లో మరో వారంలో బాహుబలి రిలీజ్ కానుంది. హాలీవుడ్ ఎడిటర్ అయిన విన్సెంట్ తబైల్లోన్
బాహుబలి ఇంటర్నేషనల్ వెర్షన్ కి ఎదిట్టింగ్ చేసిని సుమారు 23 నిమిషాలను ట్రిమ్ చేసాడని రానా తెలిపారు. కావున త్వరలోనే బాహుబలి న్యూ ఎడిటెడ్ వెర్షన్ హాలీవుడ్ మార్కెట్లో రిలీజ్ కానుంది. ఇది కాకుండా బాహుబలి ఇంటర్నేషనల్ వెర్షన్ బుషణ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పరదర్శించనున్నారని ఇది వరకే తెలియజేశాం. అలాగే బాహుబలి ప్రస్తుతం ఆస్కార్ బరిలో కూడా పోటీ పడుతుండడం విశేషం.


