త్వరలోనే మరో బాహుబలి

త్వరలోనే మరో బాహుబలి

Published on May 6, 2018 3:32 PM IST

ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచినా బాహుబలి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రెండు భాగాలుగా వచ్చినా ఆ సినిమా కథ ఇంకాస్త ఉండి ఉంటే బావుండు అని అనుకోని వారు ఉండరు. అయితే చిత్ర నిర్మాతలు అసలైన బాహుబలి కథను మళ్లీ మనముందుకు తీసుకురానున్నారు. కాకపోతే అందులో మొత్తం కొత్తవారు ఉంటారట. త్వరలనే ప్రీక్వెల్ ను రెడీ చేయనున్నట్లు నిర్మాత శోబు యార్లగడ్డ తెలిపారు.

ఆన్లైన్ సిరీస్ ద్వారా టెలి క్యాస్ట్ అయ్యే ఈ ప్రీక్వెల్ ఆగస్టులో స్టార్ట్ కానున్నట్లు చెప్పారు. ఇక రీసెంట్ గా బాహుబలి 2 ని చైనాలో రిలీజ్ చేశారు. అక్కడ అనుకున్నదానికంటే ఎక్కువ స్థాయిలోనే కలెక్షన్స్ అందుతున్నాయి. ఈ సందర్బంగా ప్రీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత వివరించారు. త్వరలోనే అందుకు సంబందించిన పూర్తి వివరాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ సిరీస్ లో మాహిష్మతి రాజ్యం ఎలా ప్రాముఖ్యతను సంపాదించుకుంది. అసలు శివగామి కోటలోకి ఎప్పుడు అడిగిపెట్టిందనే విషయాన్ని కూడా సిరీస్ లో చూపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు