చివరిదశలో ‘బాహుబలి’ రీ-రికార్డింగ్!

చివరిదశలో ‘బాహుబలి’ రీ-రికార్డింగ్!

Published on Jun 30, 2015 5:39 PM IST

Baahubali-pposter
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ వేగవంతం చేశారు. దేశవ్యాప్తంగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు ఈ సినిమాపై పెట్టుకున్న భారీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఫైనల్ ఔట్‌పుట్ ఉండేలా రాజమౌళి ప్రతి విషయాన్నీ శ్రద్ధగా నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ముంబైలో ‘బాహుబలి’ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజమౌళి-కీరవాణి రీ రికార్డింగ్ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ పనులన్నీ దాదాపుగా పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. విడుదలకు ఇంకా పదిరోజులే ఉండడంతో బాహుబలి టీమ్‌కు ఇది క్లిష్టమైన సమయమని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. మరో పక్క దేశ వ్యాప్తంగా ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రచార కార్యక్రమాలతో జోరు మీదున్నారు. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో భారీ ఎత్తున బాహుబలి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది!

తాజా వార్తలు