జూలై 10న రిలీజ్ అయ్యి ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కూడా మొదటి వారం అదిరిపోయే కలెక్షన్స్ సాధించిన సినిమా ‘బాహుబలి’. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలిలో య్పుంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శివుడు, బాహుబలి అనే రెండు పాత్రల్లో కనిపించి మెప్పిస్తే, రానా దగ్గుబాటి భళ్లాలదేవగా నెగటివ్ షేడ్స్ ని బాగా చూపించాడు. బాహుబలి సినిమా మొదటి వారంలోనే కాకుండా సెకండ్ వీకెండ్ లో కూడా అన్ని ఏరియాల్లో అన్ని భాషల్లో సూపర్బ్ కలెక్షన్స్ ని రాబట్టుకుంది.
ముఖ్యంగా నైజాంలో కలెక్షన్స్ పరంగా ఏ మాత్రం డ్రాప్స్ కనిపించలేదు. సెకండ్ వీకెండ్ లో కూడా సూపర్బ్ నెంబర్స్ ని కలెక్ట్ చేసింది. మొదటి వారంలో 22.58 కోట్ల షేర్ సాధించిన బాహుబలి సినిమా సెకండ్ వీకెండ్ లో శుక్రవారం 1.54కోట్ల షేర్, శనివారం 2.08కోట్ల షేర్ మరియు ఆదివారం 2.12కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా మొదటి 10 రోజుల్లో 28.32కోట్ల షేర్ ని సాధించింది. నైజాం ఏరియాలో ఇది అల్ టైం రికార్డ్. ట్రేడ్ పండితులు చెబుతున్న దాని ప్రకారం ఓవరాల్ గా క్లోజింగ్ టైంకి నైజాంలో 40 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేస్తుందని అంటున్నారు. తెలుగులో, ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన మొట్టమొదటి బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ కావడంతో ఈ సినిమా పై ఉన్న భారీ అంచనాలే ఈ రేంజ్ కలెక్షన్స్ తెచ్చిపెడుతోందని అంటున్నారు.
