​డిసెంబర్ 12న ‘ఫెయిల్యూర్ బాయ్స్’ విడుదల; ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాబు మోహన్

​డిసెంబర్ 12న ‘ఫెయిల్యూర్ బాయ్స్’ విడుదల; ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బాబు మోహన్

Published on Dec 8, 2025 7:00 AM IST

Babu Mohan
క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫెయిల్యూర్ బాయ్స్’. ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు నటుడు బాబు మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్’ బ్యానర్‌పై వి.ఎస్.ఎస్. కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ సంగీతం అందించారు. సుమన్, నాజర్, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు.

​ముఖ్య అతిథి బాబు మోహన్ మాట్లాడుతూ… ‘ఫెయిల్యూర్ బాయ్స్’ అద్భుతంగా ఉంటుందని, ముఖ్యంగా పాటలు సినిమాకు బలాన్నిస్తాయని అన్నారు. ప్రేక్షకులందరూ ఇలాంటి మంచి సినిమాలను సపోర్ట్ చేసి, విజయాన్ని అందించాలని కోరారు. నిర్మాత వి.ఎస్.ఎస్. కుమార్ మాట్లాడుతూ… జీవితంలో ఒకసారి ఫెయిల్ అయితేనే ఎలా పైకి రావాలో తెలుస్తుందని, దర్శకుడు వెంకట్ త్రినాథ్ రెడ్డి బ్యాంకు మేనేజర్ అయినప్పటికీ, ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశారని తెలిపారు.

​దర్శకుడు వెంకట త్రినాథ రెడ్డి మాట్లాడుతూ… తమ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చిందని, ప్రేక్షకులు కుటుంబ సమేతంగా వచ్చి సినిమాను చూడొచ్చని తెలిపారు. సినిమా ఎంతో డెడికేషన్‌తో చేశామని, తప్పకుండా ప్రేక్షకులకు ‘ఫీల్ గుడ్’ అనుభూతిని ఇస్తుందని హామీ ఇచ్చారు. హీరో అవితేజ్ మాట్లాడుతూ… తమ చిత్రానికి నిర్మాతలు వెన్నుముకగా నిలబడ్డారని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని కొనియాడారు. ఈ సినిమాను దివంగత నటుడు ప్రదీప్‌కు అంకితం ఇస్తున్నట్లు భావోద్వేగంతో ప్రకటించారు. చిత్ర యూనిట్‌లోని పలువురు సభ్యులు సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు