‘మా’ ఎన్నికల బరిలోకి బాబు మోహన్?

Published on Sep 11, 2021 3:00 am IST


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాఫిక్‌గా మారాయి. అయితే సీనియర్ నటుడు బాబుమోహన్ కూడా మా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే స్వతంత్ర అభ్యర్థిగానే ఆయన పోటీ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. త్వరలో ఆయన దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ముఖ్యంగా మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు పోటీలో ఉన్నారు. వీరిద్దరు ఈ ఎన్నికకు ముందు వరుసలో ఉన్నారు. ఇక బాబు మోహన్ రేసులో చేరితే, ఎన్నికల ప్రచారం కొత్త మలుపు తిరుగుతుందని ఆశిస్తున్నారు. ఇకపోతే బండ్ల గణేష్ కూడా ఇటీవల ‘మా’ లో ప్రధాన కార్యదర్శి స్థానానికి స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించాడు.

సంబంధిత సమాచారం :