ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా నుంచి వచ్చిన పలు సెన్సేషనల్ హిట్స్ అందులో చిన్న సినిమాల్లో వచ్చి భారీ సక్సెస్ అందుకున్న వాటిలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన సినిమా “బేబి” కూడా ఒకటి.
మరి ఇదే జంట కాంబినేషన్ లో చేస్తున్న మరో చిత్రమే “ఎపిక్”. 90స్ బయోపిక్ తో సత్తా చాటిన ఆదిత్య హాసన్ అదే సిరీస్ నుంచి పాత్రలతో తెరకెక్కించిన ఈ సినిమాలో లాస్ట్ డే అంటూ వైష్ణవి చైతన్య ఎమోషనల్ పోస్ట్ ద్వారా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
నేను ప్రతీ మూమెంట్ ని ఎంజాయ్ చేసిన సినిమా ఇది అని ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరూ తనకి కుటుంబంలా మారిపోయారు అని ఈ స్పెషల్ ప్రాజెక్ట్ లో భాగం అయ్యినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. ఇక ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.
