పవన్ వీరమల్లు నుండి బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్

Published on May 25, 2021 3:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ కూడ ఒకటి. క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే సినిమా షూటింగ్ కొంత పూర్తికాగా లాక్ డౌన్ మూలంగా నిలిచిపోయింది. త్వరలోనే షూటింగ్ రీస్టార్ట్ కానుంది. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ అభిమానుల్ని మెప్పించింది. దీంతో టీజర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2న రిలీజ్ చేసే ప్లాన్స్ జరుగుతున్నాయట.

షూటింగ్ రీస్టార్ట్ కాగానే టీజర్ కట్ కు కావాల్సిన పోర్షన్ వరకు షూటింగ్ కంప్లీట్ చేయాలని క్రిష్ భావిస్తున్నారట. ఇక ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఆమె పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ ఆమె పుట్టినరోజైన ఆగష్టు 17న విడుదల చేయాలని భావిస్తున్నారట. సో.. పవన్ అభిమానులకు బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్స్ ఖాయం. ఏఎమ్ రత్నం, దయాకర్ రావ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఉండనుంది. పవన్ మొదటిసారి చేస్తున్న పిరియాడికల్ మూవీ కాబట్టి అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :