Toxic Teaser: బోల్డ్ సీన్ పై తీవ్ర విమర్శలు.. యష్ పైత్యమేనా ఇది?

Toxic Teaser: బోల్డ్ సీన్ పై తీవ్ర విమర్శలు.. యష్ పైత్యమేనా ఇది?

Published on Jan 8, 2026 4:06 PM IST

Toxic

ప్రస్తుతం ఆన్లైన్ లో సెన్సేషన్ గా వినిపిస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ గ్యాంగ్ స్టర్ చిత్రం “టాక్సిక్” (Toxic Movie) కోసమే అని చెప్పాలి. మరి ఈ సినిమా నుంచి నేడు యష్ పుట్టినరోజు కానుకగా వచ్చిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ టీజర్ లో కొన్ని మూమెంట్స్ కి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది కానీ ఒక సీన్ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది.

Negative comments on Toxic teaser – ఇంటిమేట్ సీన్ పై విమర్శలు..

ఈ టీజర్ (Toxic Teaser) లో ఊహించని విధంగా ఓ మాస్ బ్లాస్ట్ సీన్స్ ని ఇంటిమెంట్ సీన్ తో చాలా బోల్డ్ గా ప్రెజెంట్ చేయడం జరిగింది. మరి ఈ సన్నివేశంపై మాత్రం గట్టి విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. ఒక బిగ్ ప్రాజెక్ట్ సినిమా నుంచి ఇలాంటి సీన్ ఉన్న టీజర్ ని ఆన్లైన్ లో వదిలితే మెయిన్ గా ఇళ్లలో పెద్దలతో టీవిలో మొదటి సారి చూద్దాం అనుకున్న వారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. పైగా యాక్షన్ కోసం ఇలాంటి సీన్ ని ఇరికించడం అనవసరం అని కూడా చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

యష్ ప్రమేయం ఉందా?

ఈ చిత్రానికి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geethu Mohan Das) పని చేశారు. అయితే తన గత వర్క్ కోసం తెలిసినవారు ఈ టీజర్ చూసి చాలా బాధపడుతున్నారు. ఆమేనా ఇలాంటి సీన్ తీశారు అని చింతిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో కొన్ని అంశాలు గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఈ చిత్రం రచనలో యష్ హ్యాండ్ ఉంది. అలాగే ఇంకొన్ని కామెంట్స్ కూడా యష్ నే పలు సన్నివేశాలు డైరెక్ట్ చేశారు అని కూడా ఉన్నాయి. దీనితో ఈ పర్టిక్యులర్ సీన్ వరకు మాత్రం అది యష్ పనితనమే అని చెప్పడానికి కూడా లేదు.

సో ఇలాంటివి అన్నీ ఓటిటి వరకు అంటే ఓకే అనుకోవచ్చు కానీ వెండితెరపై సినిమాలు పైగా యష్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ స్టార్ కూడా సో ఇలాంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు