సాహోలో ప్రభాస్ జేమ్స్ బాండ్ వేషాలు కూడా వేస్తాడా…?

Published on Aug 19, 2019 5:35 pm IST

సాహో విడుదలకు ఇంకా అటుఇటుగా 10 రోజులే మిగిలి వుంది. ఈనేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార జోరు పెంచింది. నిన్న రామోజీ ఫిలిం సిటీ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అతిరథుల మహారధులు మధ్య, అభిమానుల సమక్షంలో అట్టహాసంగా నిర్వహించారు. కాగా నేడు సాహో నుండి బ్యాడ్ బాయ్ అనే ఓ గ్లామరస్ సాంగ్ ని విడుదల చేయడం జరిగింది. ప్రభాస్, జాక్విలిన్ పెర్నాండెజ్ మధ్య హాట్ హాట్ సెక్సీ స్టెప్స్ తో సాగిన ఈ సాంగ్ కుర్రకారు గుండెల్లో గుబులు రేపెలా ఉంది. ముఖ్యంగా జాక్విలిన్ పొట్టి బట్టలలో సెక్సీ సెట్స్ తో సాంగ్ ని హీటెక్కించేసింది.

ఐతే ఈ సాంగ్ చూస్తుంటే సాహో సినిమాలో ప్రభాస్ హాలీవుడ్ జేమ్స్ బాండ్ తరహాలో లక్ష్యం కోసం హాట్ భామలను వలలో వేసుకొని నైస్ గా మేటర్ రాబట్టి స్మూత్ గా తప్పించుకుంటాడా, అనే డౌట్ వస్తుంది. దశాబ్దాలుగా జేమ్స్ బాండ్ మాఫియా లీడర్ రహస్యాలు తెలుసుకోవడం కోసం, వారి ఆటకట్టించడం కోసం వారితో సన్నిహిత సంబంధాలున్న అమ్మాయిలను వలలో వేసుకొని ఇన్ఫర్మేషన్ రాబడుతుంటారు. మొదటి తరం బాండ్ హీరోగా చేసిన బారీ నెల్సన్ నుండి ప్రస్తుత బాండ్ హీరో డానియల్ గ్రెగ్ వరకు ఇలాంటి రొమాంటిక్ వేషాలే వేస్తున్నారు.

బ్యాడ్ బాయ్ సాంగ్ చూసిన తరువాత దర్శకుడు సుజీత్ ప్రభాస్ చేత ఇలాంటి వేషాలు వేయించారా ఏంటి అని డౌట్ కొడుతుంది. కాగా బ్యాడ్ బాయ్ సాంగ్ ని బాద్షా రచించి స్వర పరచడంతో పాటు, పాడారు. ఇక ఆయనకు జోడిగా ఈ పాటను నీతి మోహన్ పాడటం జరిగింది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :