25 కోట్లకి అమ్ముడు పోయిన ‘బాహుబలి-1’ నైజాం రైట్స్

dil-raj-bahubali
టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘బాహుబలి’. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ హోరా హోరీగా జరుగుతోంది. ఇప్పటికే బాహుబలి మొదటి పార్ట్ కి సంబందించిన సీడెడ్ రైట్స్ 13 కోట్లకు, కర్నాటక రైట్స్ 9 కోట్లకు కొనుగోలు చేసారని తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం బాహుబలి మొదటి పార్ట్ రైట్స్ 25 కోట్లకి కొనుగోలు చేసారు..

ఆ రైట్స్ కొనుక్కున్నది మరెవరో కాదు, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం పై ఉన్న అంచనాలు, సినిమా తెరకెక్కుతున్న విధానం చూసిన డిస్ట్రిబ్యూటర్స్ ఏ మాత్రం వెనకాడకుండా ఈ సినిమా రైట్స్ ని భారీ మొత్తానికి తీసుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ ప్రభాస్ – తమన్నాలపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా, కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

Exit mobile version