మరోసారి ఖండాంతరాలు దాటిన “బాహుబలి” ఖ్యాతి.!

Published on May 28, 2020 5:49 pm IST

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ ఎపిక్ విజువల్ డ్రామా “బాహుబలి” ఒక్కసారిగా మన తెలుగు సినిమా ఖ్యాతిని మాత్రమే కాకుండా భారతదేశ సినిమా చరిత్రనే ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది.

ప్రభాస్ కోసమే అనుకున్న ఈ చిత్రం సృష్టించిన ప్రకంపనలు ఒక్క మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఎల్లలు చెరిపేసి ఎన్నెన్నో రికార్డులను నెలకొల్పేలా చేసాయి.

రికార్డుల మాట అలా ఉంచితే ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనానికి దక్కిన ఇప్పటికీ దక్కుతున్న గౌరవమే ఈ సినిమా అనుకున్న అసలైన విజయానికి అద్దం పట్టింది.

బాహుబలి 2 చిత్రాన్ని మొట్ట మొదటి సారిగా ఇపుడు రష్యా దేశంలో టీవీ ఛానెల్ వారు టెలికాస్ట్ చేసారు. అక్కడ టెలికాస్ట్ చేయబడిన మొట్ట మొదటి తెలుగు చిత్రంగానే కాకుండా మొట్ట మొదటి భారతదేశపు చిత్రంగా బాహుబలి 2మరింత ఖ్యాతిని గడించింది.

రష్యన్ వాయిస్ ఓవర్ తో ఈ చిత్రం అక్కడ టెలికాస్ట్ అయ్యినట్టుగా రష్యా ఇన్ ఇండియా వారు తెలిపారు. ఈ చిత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా సరే ఇలాంటి గౌరవాన్ని అందుకోవడం మన తెలుగు సినిమాకు మరియు భారతీయ సినిమాకు గర్వ కారణం.

సంబంధిత సమాచారం :

More