దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ సిరీస్ ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడిన విషయం తెలిసిందే. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేసింది. కాగా బాహుబలికి ఇప్పుడు మరో అరుదైన గౌరవం కూడా దక్కింది.
ఆల్బర్ట్ మ్యూజిక్ హాల్ లో బాహుబలిని ప్రదర్శించనున్నారు. అది కూడా హ్యారీ పోట్టర్ అండ్ ది గాబ్లిట్ ఆఫ్ ఫైర్, స్కై ఫాల్ వంటి సినిమాలతో కలిపి బాహుబలిని ప్రదర్శించనున్నారు. దశాబ్దకాలంలో వచ్చిన బెస్ట్ సినిమాల్లోని కొన్నిటిని మాత్రమే ఎంపిక చేసి వాటిని ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శిస్తారు.


