ప్రభాస్ సినిమా రెమ్యునరేషన్స్ కే “బాహుబలి” రేంజ్ బడ్జెట్.?

Published on May 30, 2021 2:25 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఇండియన్ సినిమా నుంచి ఇంటెర్నేషన్ సినిమా వరకు ఒక బ్రాండ్ గా మారిపోయింది. మరి అలా తన వల్ల ఓ సినిమా పాన్ ఇండియన్ స్టేటస్ తెచ్చుకున్న సందర్భంలో ప్రభాస్ తో ప్లాన్ ఏకంగా పాన్ వరల్డ్ చిత్రంనే యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ అనౌన్స్ చెయ్యడంతో ఈ ప్రాజెక్ట్ పై ప్రభాస్ అభిమానులు మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు.

అయితే ఇపుడు ఈ సినిమాకు సంబంధించే ఇంట్రెస్టింగ్ టాక్ తెలుస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సహా ఇతర అగ్ర తారలు అమితాబ్, దీపికాలు ఇలా అందరికీ కలిపి ఏకంగా 200 కోట్లు ఒక్క రెమ్యునరేషన్స్ కే అయ్యిపోతుందట. ఇదే 200 కోట్లతో అపుడు రాజమౌళి బాహుబలినే తీసేసారు. మరి అలాంటిది ఈ సినిమా కోసం ఒక్క రెమ్యునరేషన్స్ కే ఇంత ఖర్చు అవుతుంటే సినిమా మొత్తంకి అయ్యే బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ చిత్రానికి లెజెండరీ నిర్మాత అశ్వనీ దత్ 600 కోట్ల మేర బడ్జెట్ పెడుతున్నారని ఆమధ్య టాక్ బయటకి వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :