రామోజీ ఫిల్మ్ సిటీలో బిజీగా ఉన్న ‘బాహుబలి’ టీం

Bahubali
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – యంగ్ హంక్ రానా అన్నదమ్ములుగా టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ సెట్లో మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్ పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ వారం అంతా ప్రభాస్ పై వచ్చే సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ప్రభాస్ తో పాటు ప్రముఖ తారాగణం కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ తో ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో ఈ సినిమాకి విజువల్ ఎఫ్ఫెక్ట్స్ ని రూపొందిస్తున్నారు. 2015లో రెండు పార్ట్స్ గా రానున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కెకె సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.

Exit mobile version