యాక్షన్ ఎపిసోడ్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ – అనుష్క

యాక్షన్ ఎపిసోడ్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ – అనుష్క

Published on Aug 6, 2014 11:47 AM IST

bahubali-first-look
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, యంగ్ హీరో రానా దగ్గుబాటి విలన్ గా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘బాహుబలి’. సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పాలసముద్రం సెట్ వేసారు. ప్రస్తుతం ఆ పాలసముద్రం సెట్లో యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేస్తున్నారు.

ఈ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ లో ప్రభాస్, అనుష్క, సత్య రాజ్, అడవి శేష్ పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు 28వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరగనుంది. రెండు పార్ట్స్ గా రానున్న ‘బాహుబలి’ పై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. రాజమౌళి కూడా ఈ సినిమాతో ఇంటర్నేషనల్ టెక్నికల్ స్టాండర్డ్స్ ని టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం చేయనున్నాడు. తమన్నా మరో హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ, సుధీప్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ 2015 ఏప్రిల్లో విడుదల కానుంది.

తాజా వార్తలు