ఇన్నేళ్ళైనా బాలీవుడ్ లో చెదరని బాహుబలి హవా.!

Published on Jun 5, 2020 2:04 am IST


ఇండియాల్ బాక్సాఫీస్ హిస్టరీలో వసూళ్ల సునామీని చూపించిన చిత్రం “బాహుబలి 2”. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొట్ట మొదటిసారిగా 1000 కోట్ల కలెక్షన్ మార్కును అందుకుని వండర్ క్రియేట్ చేసింది. అలాంటి సినిమా మన తెలుగు ఇండస్ట్రీకు చెందడం మనకే గర్వ కారణం. అయితే ఎల్లలు చెరిపేసిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ దుమ్ము రేపింది.

ప్రభాస్ తో రాజమౌళి తెరకెక్కించిన ఈ రెండు సినిమాలు కూడా బాలీవుడ్ లో గట్టి డామినేషన్ ను చూపించాయి. ఇప్పటికే “బాహుబలి ది బిగింగ్” విడుదలై ఐదేళ్లు దాటింది. అయినప్పటికీ బాలీవుడ్ జనంలో బాహుబలి హవా ఇంకా చెక్కు చెదరలేదని మరోసారి నిరూపితం అయ్యింది.

గత వారం ఈ చిత్రాన్ని సోనీ మాక్స్ లో టెలికాస్ట్ చెయ్యగా భారీగా 70 లక్షలకు పైగా ఇంప్రెషన్స్ రాబట్టి టాప్ 2 లో నిలిచింది. ఈ విషయాన్ని బ్రాడ్ క్యాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా వారు వెల్లడించారు. హిందీలో అత్యధికంగా చూసిన టాప్ 5 సినిమాలలో ఇన్నేళ్ళైనా సరే బాహుబలి 1 నెంబర్ 2 స్థానంలో నిలవడం విశేషం.

సంబంధిత సమాచారం :

More