పుకార్లపై క్లారిటీ ఇచ్చిన ‘బాహుబలి’ టీమ్!

baahubali

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ఇండియన్ సినిమాలో ఓ సరికొత్త ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా ‘బాహుబలి’. తెలుగు, తమిళ, హిందీ, మళయాలం ఇలా విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలన విజయం సాధించిన ఈ సినిమాకు కొనసాగింపుగా బాహుబలి ది కంక్లూజన్ అనే సినిమా ఉండనున్న విషయం తెలిసిందే. ఒక అద్భుతమైన సస్పెన్స్‌తో ముగిసిన బాహుబలి పార్ట్ 1 తర్వాత వచ్చే సినిమా కావడంతో బాహుబలి పార్ట్ 2 పై ఇప్పట్నుంచే విపరీతమైన అంచనాలు బయలుదేరాయి.

ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే బాహుబలి పార్ట్ 2ను పార్ట్ 1ను మించేలా తయారుచేసేలా రాజమౌళి అండ్ టీమ్ కష్టపడుతోంది. పార్ట్ 2 విషయంలో తాజాగా ఓ వార్త బాగా ప్రచారంలోకి వచ్చింది. బాహుబలి పార్ట్ 2లోని ఓ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్‌ను సంప్రదించినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయమై బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. బాహుబలి కోసం మాధురి దీక్షిత్‌ను సంప్రదించలేదని స్పష్టం చేశారు. డిసెంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమా 2016 చివర్లో కానీ, 2017లో కానీ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Exit mobile version