పూరీ అంటే ఇష్టం, అసూయ రెండు అంటున్న బాహుబలి రచయిత.!

Published on May 28, 2021 2:00 pm IST

మన టాలీవుడ్ దర్శకుల్లో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ అండ్ టేకింగ్ ఉంది. అయితే అలాంటి దర్శకుల్లో సూపర్ ఫాస్టెస్ట్ స్టార్ దర్శకులు ఎవరన్నా ఉన్నారు అంటే అది మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. తన ప్రతి సినిమాకు కావాల్సినంత మాస్ తో అదరగొట్టే పూరీపై మన ఇండియన్ సినిమాలోనే అతి పెద్ద కథా రచయితల్లో ఒకరైన విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.

ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే “ఆలీతో సరదాగా” ప్రోగ్రాం కు గెస్ట్ గా వచ్చిన ఆయన లేటెస్ట్ ప్రోమోలో ఉంది. తన కొడుకు దర్శకుడు రాజమౌళి కాకుండా టాలీవుడ్ లో ఏ దర్శకుడు అంటే ఇష్టం అని అడగ్గా తనకి పూరి జగన్నాథ్ అంటే ఇష్టం అసూయ రెండు ఉన్నాయని తెలిపారు. అంతే కాకుండా పూరీని తన శత్రువులా భావిస్తానని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు.

అలాగే ఇవే అనుకుంటే ఏకంగా తన మొబైల్ స్క్రీన్ వాల్ పేపర్ గా పెట్టుకున్నానని చూపించారు. మరి అలాంటి రైటర్ మొబైల్ స్క్రీన్ పైకే పూరీ బొమ్మ ఎక్కింది అంటే తన ఇంపాక్ట్ ఏ లెవెల్లో కలిగించాడో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం “RRR”, పూరి జగన్నాథ్ తన “లైగర్” పాన్ ఇండియన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :