ఒకేసారి రెండు సినిమాలతో బాలయ్య !

Balakrishna

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మించటానికి ముమ్మరంగా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం మార్చి రెండో వారంలో వినాయక్ – బాలయ్య సినిమా మొదలవ్వనుందని తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో గతంలో ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం వచ్చింది. మళ్ళీ 16 ఏళ్ల తరవాత ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

మరి వారి అంచనాలను ఈ కాంబినేషన్ రీచ్ అవుతుందో లేదో చూడాలి. అయితే బాలయ్య ఇటు వి.వి వినాయక్ సినిమా చేస్తూనే.. అటు సమాంతరంగా బోయపాటి శ్రీనుతో కూడా ఓ సినిమా చెయ్యటానికి ప్లాన్ చేశారట. మొత్తానికి ఫిఫ్టీ ప్లస్ లో కూడా బాలయ్య యంగ్ హీరోలు కంటే స్పీడుగా సినిమాలు చేస్తుండటం.. నిజంగా బాలయ్యకి నటన పై ఉన్న అంకితభావమే కారణమని చెప్పాలి.

ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా ఉన్నారు. జనవరి మొదటివారానికి ఆ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మొత్తం బాలయ్య పూర్తి చేయనున్నారు.

Exit mobile version