‘లెజెండ్’ లాంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా మరో పవర్ఫుల్ సినిమా చేస్తున్నాడు. ‘గాడ్సే’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రంపచోడవరంలో జరుగుతోంది. లెజెండ్ లో లానే ఇందులో కూడా బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నాడని ఇది వరకే తెలియజేశాం. ఇందులో ఒక పాత్రలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
వర్షాల కారణంగా ఈ సినిమా షూటింగ్ గత కొద్ది రోజులుగా ఆగిపోయింది. వర్షం పడని సమయంలో మాత్రమే షూటింగ్ చేస్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. సత్యదేవ డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రుద్రపాటి రమణారావు నిర్మాత.
