బ్యాలెన్స్ పార్ట్ ప్లాన్ చేస్తోన్న బాలయ్య !

Published on Aug 30, 2021 11:22 pm IST

బాలయ్య బాబు – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో వస్తోన్న సినిమా ‘అఖండ’. ఇటివల తమిళనాడులో స్టార్ట్ అయిన షెడ్యూల్‌ పూర్తి అయిన తెలుస్తోంది. తాజాగా హైదరాబద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో బ్యాలెన్స్ పార్ట్ కి సంబందించిన షూట్ చేయడానికి రెడీ అవుతుంది టీమ్. ఈ సీన్స్ లో బాలకృష్ణతో పాటు ప్రగ్యా అలాగే ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొన్నారట.

ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా పై బాలయ్య ఫ్యాన్స్ బాగా హోప్స్ పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అందుకే ఈ సినిమా యాక్షన్ విషయంలో చాలా రకాలుగా ఆలోచించి సినిమాని ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. ఇక ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్.

సంబంధిత సమాచారం :