అఖండ ఆ డేట్‌ని కన్‌ఫాం చేసుకోబోతుందా?

Published on Aug 28, 2021 2:35 am IST

నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”. మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఇదిలా ఉంటే అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను విడుద‌ల చేయనున్నట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించినప్పటికే ఇప్పుడు ఆ తేదీని మార్చనున్నారని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో బాలయ్య సినిమాను అదే రోజున రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని, త్వరలోనే ఈ తేదీని ఫైనల్ చేసి ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే అక్టోబ‌ర్ 12న అఖిల్ అక్కినేని న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ ఒక రోజు ముందు విడుద‌ల కానుండడంతో ఈ సారి నందమూరి, అక్కినేని అభిమానులకు మధ్య ఫైట్ నడిచే అవకాశం ఉండొచ్చు.

సంబంధిత సమాచారం :