బాలయ్య సినిమా టైటిల్ పై మళ్ళీ రూమర్ !

Balakrishna Boyapati Srinu1

బోయపాటి శ్రీను – బాలయ్య బాబు సినిమాకి టైటిల్ అంటేనే పవర్ ఫల్ గా ఉంటుంది. అయితే ఇప్పటికీ ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయలేదు. ఆల్ రెడీ టీజ‌ర్ ను ‘బీబీ3′ పేరుతో విడుద‌ల‌ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. అలాగే సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేశారు. అయినా టైటిల్ ను మాత్రం ఫిక్స్ చేయలేదు. ఇక ఈ సినిమా టైటిల్ పై మాత్రం ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అందులో ప్రధానంగా ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ బాగా వినిపిస్తోంది.

ఆ తరువాత ‘డేంజర్’ అనే మరో టైటిల్ కూడా బాగా వినిపించింది. కాగా కథకు ఈ రెండు టైటిల్స్ పర్ఫెక్ట్ గా సరిపోతాయట. అయితే బోయపాటి మాత్రం మోనార్క్ అనే టైటిల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడట. కాగా ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్‌ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

మొత్తానికి టీజర్ లో మాత్రం బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో… పైగా పంచ కట్టులో వైట్ అండ్ వైట్ లో అభిమానులను బాగానే అలరించారు. ఏమైనా బాలయ్యకు ఈ సారి కూడా బోయపాటి సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

Exit mobile version