బాలకృష్ణ -బోయపాటి ల చిత్రానికి ముహూర్తం కుదిరిందా ?
Published on Jul 17, 2018 2:09 am IST

‘సింహ , లెజెండ్’ బ్లాక్ బాస్టర్ చిత్రాల తరువాత బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్ లో మరో చిత్రం రానుందని తెలిసిందే. అయితే ఈ చిత్రం జులై 10వ తేదీనే లాంచ్ అవ్వాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం.

వరుస విజయాలతో దూసుకుపోతున్న చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈచిత్రాన్నినిర్మిచనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

ఇక బాలకృష్ణ ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రంలో నటిస్తుండగా బోయపాటి, రాంచరణ్ 12 వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాత వీరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook