గుంటూరులో బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్

Balakrishna Boyapati Srinu1
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలయ్య, బోయపాటిల కలయికలో వస్తున్న మూడవ చిత్రం. చిత్రీకరణ దశలో ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇటీవలే చిత్రీకరణ తిరిగి మొదలైంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తర్వాతి షెడ్యూల్ ఫిబ్రవరి 2వ వారం నుండి మొదలుపెట్టనున్నారు.

అది కూడ గుంటూరులోని నేచ్యురల్ లొకేషన్లలో షూటింగ్ జరపనున్నారు. ఈ షెడ్యూల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారట టీమ్. మే 28వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకులకు అందివ్వనున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమా టైటిల్ ఏమిటనేది ఇంకా రివీల్ చేయలేదు టీమ్. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి.

Exit mobile version