కీసరలో బిజీగా ఉన్న బాలకృష్ణ

కీసరలో బిజీగా ఉన్న బాలకృష్ణ

Published on Oct 12, 2014 10:25 PM IST

Balayya-Rampachodavaram
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సత్యదేవ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కీసరలో జరుగుతోంది. ఔటర్ రింగ్ రోడ్ లో బాలకృష్ణ – విలన్స్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను రామ్ లక్షణ్ మాస్టర్స్ నేతృత్వంలో షూట్ చేసారు. ఈ చేజ్ సీక్వెన్స్ లో హెలికాఫ్టర్స్, మోటార్ సైకిల్స్ మరియు చాలా కార్లను ఉపయోగించారు.

బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ లో రాధిక ఆప్టే, త్రిష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. ఇదిలా ఉంటే బాలకృష్ణ షూటింగ్ కీసరలో జరుగుతుందని తెలుసుకున్న అక్కడికి ఫ్యాన్స్ అందరూ వచ్చి సందడి చేసారు.

తాజా వార్తలు