ఈ రోజు ఉదయం చక్రి హఠాన్మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు తీవ్రమైన షాక్ కి గురయ్యారు. ఈ వార్త విన్న వెంటనే ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ హుటాహుటిన హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో చక్రి భౌతిక కాయాన్ని సందర్శించడానికి వెళ్ళారు. ఎన్నో మధురమైన, విజయవంతమైన స్వరాలను తనకందించిన సంగీత దర్శకుడికి కడసారి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… నేను చక్రికి పెద్ద అభిమానిని. అతని మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. చాలా సహృద స్వభావం కల వ్యక్తి. అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
‘సింహ’, ‘శ్రీమన్నారాయణ’ వంటి బాలకృష్ణ విజయవంతమైన సినిమాలకు చక్రి సంగీతం అందించారు. ‘సింహా’ సినిమాకు గాను చక్రి తొలి నంది అవార్డు సొంతం చేసుకున్నారు.
