నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలై సూపర్ టాక్‌తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ‘భలే భలే మగాడివోయ్’ లాంటి బంపర్ హిట్ తర్వాత నాని నటించిన సినిమా కావడం, మొదట్నుంచీ ఈ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడం, రిలీజ్ తర్వాత మొదటిషో నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో కృష్ణగాడు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కురిపిస్తున్నాడు. ఈ సినిమాలో నాని నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తూండగా, బాలయ్య అభిమానిగా నాని చేసిన ఎపిసోడ్స్ స్పెషల్ హైలైట్‌గా నిలిచాయి.
ఇక ఈ సాయంత్రం నందమూరి బాలకృష్ణ కోసం ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ స్పెషల్ షోను ఏర్పాటు చేశారు. ఈ షో చూసిన బాలయ్య సినిమా బాగుందని యూనిట్‌ను మెచ్చుకున్నారట. తన అభిమానిగా నాని చేసిన ఎపిసోడ్స్‌ను బాగా ఎంజాయ్ చేశానని ఆయన అన్నారట. ఇక నాని నటనకు బాలయ్య ప్రత్యేక కితాబులు అందించినట్లు తెలుస్తోంది. 14 రీల్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా, మెహ్రీన్ హీరోయిన్‌గా నటించారు.


