2015లో బాలకృష్ణ డబుల్ ధమాకా..!

2015లో బాలకృష్ణ డబుల్ ధమాకా..!

Published on Feb 7, 2015 9:50 AM IST

balakrishna
గత ఏడాది ‘లెజెండ్’తో అభిమానులను ఖుషి చేయడంతో పాటు నిర్మాతకు కాసుల వర్షం కురిపించారు నందమూరి బాలకృష్ణ. 2014లో భారి విజయం సాదించిన సినిమాలలో ‘లెజెండ్’ ఒకటిగా నిలిచింది. కథల ఎంపికలో జోరు పెంచిన బాలయ్య, ఈ ఏడాది అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు.

ఈ వేసవి ప్రారంభంలో ‘లయన్’గా బాక్సాఫీస్ వద్ద గర్జించడానికి రెడీ అయ్యారు. సత్యదేవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి నెలలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య నటించబోయే 99వ సినిమా ‘డిక్టేటర్’ సెట్స్ పైకి వెళ్తుంది. కోన వెంకట్, గోపి మోహన్ లు స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారు. సింగిల్ షెడ్యూల్ లో సినిమా షూటింగ్ పూర్తి చేసి దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

వేసవికి ‘లయన్’గా, తర్వాత దసరాకు ‘డిక్టేటర్’గా…. బాక్సాఫీస్ వద్ద నందమూరి బాలకృష్ణ సందడి చేయనున్నారు. ‘పటాస్’తో ప్రారంభమైన నందమూరి హీరోల విజయయాత్ర ఇలాగే కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

తాజా వార్తలు