బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న యాక్షన్ సినిమాలో సీనియర్ బాలయ్యకు జోడీగా మీనాని తీసుకోనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బోయపాటి సీనియర్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం హోమ్లీ హీరోయిన్ స్నేహను తీసుకోబోతునట్లు తెలుస్తోంది. బాలయ్య – స్నేహ కూడా ఒక ఫ్యామిలీ సాంగ్ కూడా ప్లాన్ చేశాడట. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది. కాగా ఆ మధ్య ఒక నిమిషానికి పైగా వచ్చిన ఈ సినిమా టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ దుమ్ము రేపే యాక్షన్ తో రెచ్చిపోయారు.
ముఖ్యంగా పంచ కట్టులో బాలయ్య లుక్ కేకగా ఉంది. వైట్ అండ్ వైట్ లో బాలయ్య చక్కగా సరిపోయారు. సినిమాలో కూడా బాలయ్య అదే లుక్ తో కనిపిస్తారట. ఇక బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి సూపర్ విజయాలను అందించారు బోయపాటి. కాబట్టి ఈసారి కూడా సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.


