తమిళ స్టార్ హీరోపై బాలయ్య అభిమానులు గరం..!

Published on Aug 24, 2021 12:04 am IST

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. #NBK107 టైటిల్‌తో వస్తున్న ఈ ప్రాజెక్టులో బాలయ్యను ఢీకొట్టే విలన్‌గా తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతిని తీసుకోవాల్ని దర్శకుడు గోపిచంద్ అనుకున్నాడట. కానీ విజయ్ సేతుపతి మాత్రం ఈ సినిమాలో నటించేందుకు నో చెప్పాడని వార్తలు వినిపించాయి.

ఈ కారణంగానే బాలయ్య అభిమానులు విజయ్ సేతుపతిపై గరం అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయ్‌పై గట్టిగానే ట్రోల్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య సరసన నటించేందుకు శృతిహాసన్ కూడా నో చెప్పిందని, దర్శకుడు గోపిచంద్ సెంటిమెంట్‌ను కాద‌న‌లేక ఏదైనా గెస్ట్ రోల్ అయితే చేస్తాన‌ని శృతిహాస‌న్ చెప్పిన‌ట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :