పోలింగ్ విషయంలో ఆనందంగా ఉన్న బాలకృష్ణ

పోలింగ్ విషయంలో ఆనందంగా ఉన్న బాలకృష్ణ

Published on May 8, 2014 12:50 PM IST

Balakrisha
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నటించిన ‘లెజెండ్’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆయన ఎన్నికల బరిలో అడుగుపెట్టి హిందూపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసారు.

సీమాంధ్ర ప్రాంతంలో నిన్న ఎలక్షన్స్ జరిగాయి. అలాగే బాలకృష్ణ పోటీ చేసిన హిందూపూర్ లో కూడా అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఈ విషయంలో బాలకృష్ణ చాలా హ్యాపీగా ఉండడమే కాకుండా కచ్చితంగా మంచి మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మామూలుగా హిందూపూర్ ప్రాంతం టిడిపి నేతలకు బాగా కలిసొచ్చిన ప్రాంతం కావున బాలకృష్ణ కూడా అక్కడ మంచి విజయం సాదించి అదే పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు