నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లయన్’. ఈ సినిమా ఆడియో వేడుక నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకలవేదికలో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యాడు. ఆయనతో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ ఆడియో లాంచ్ కి హాజరయ్యారు. ఈ వేడుకలో చంద్రబాబు నాయుడు బాలయ్య బాబుకి ఇండస్ట్రీలో పోటీనే లేదని అన్నారు.
లయన్ ఆడియో లాంచ్ లో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలకృష్ణకు అస్సలు పోటీనే లేదు. అతనొక ప్రత్యేకమైన నటుడు, ఎవ్వరూ అతను చేసినన్ని డిఫరెంట్ పాత్రలని అటెంప్ట్ చెయ్యలేదని’ అన్నాడు. ఈ ఆడియో వేడుకలో లయన్ సినిమా ట్రైలర్ మరియు కొన్ని ప్రోమో సాంగ్స్ ని కూడా రిలీజ్ చేసారు. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రుద్రపతి రమణారావు నిర్మాత.


