భారీ స్థాయిలో ‘ఎన్టీఆర్’ సినిమా లాంచ్ !
Published on Mar 6, 2018 6:09 pm IST

నందమూరి బాలక్రిష్ణ ప్రస్తుతం తన తండ్రి స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవితాన్ని బయోపిక్ రూపంలో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా చిత్ర లాంచ్ ను భారీ స్థాయిలో నిర్వహించాలని బాలక్రిష్ణ భావిస్తున్నారు. అందుకే తన తండ్రి ఎన్టీఆర్ నిమ్మకూరు, తల్లి బసవతారకం సొంత అయిన కొమరవోలు ప్రజల్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారాయన.

అంతేగాక అభిమానులకు కూడ ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. ఈ నెల 29న రామక్రిష్ణ స్టూడియోస్ లో ఈ కార్యక్రమం జరగనుంది. తేజ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో సుమారు 62 గెటప్స్ లో కనిపించనున్నారు. బాలక్రిష్ణతో పాటు సాయి కొర్రపాటి, విష్ణు ఇందురిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారట.

 
Like us on Facebook