హిందూపురం ముస్లిం సోదరులకు బాలయ్య ఇఫ్తార్ విందు

Published on Jun 1, 2019 11:22 am IST

ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని హిందూపురంలో ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులతో పాటు ఆయన కూడా నమాజ్ చేశారు. అనంతరం విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ముస్లింలకు పవిత్ర మాసం రంజన్ అని, సోదరుల ఉపవాస దీక్షలు ఫలవంతం కావాలని కోరుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ కె ఎస్ రవి కుమార్ కంబినేషన్లో తెరకెక్కాల్సిన “రూలర్” కథా మార్పుల విషయమై ఆలస్యం కానుందని సమాచారం. మరి ఈ గ్యాప్ లో తనకు సింహా,లెజెండ్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటితో కమిటవుతాడేమో చూడాలి మరి. బోయపాటి ఓ వైపు బాలయ్య ఆదేశిస్తే రంగంలోకి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :

More