
తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు మరోసారి నటుడు మరియు రాజకీయ నాయకుడు అయిన నందమూరి బాలకృష్ణపై పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ పొగడ్తలకి నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ 400 రోజుల విజయోత్సవ సభ వేదికైంది. లెజెండ్ సినిమా సక్సెస్ఫుల్ గా 400 రోజులు ప్రదర్శించబడడంతో ఈ సినిమా 400 రోజుల వేడుకని జరిపారు. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యాడు.
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘లెజెండ్ సినిమాతో బాలకృష్ణ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ రికార్డ్ ని సృష్టించారు. బాలకృష్ణ నిజమైన రియల్ హీరో, నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని ఎంతో సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. లెజెండ్ అనే పేరే సినిమా యొక్క లెజెండ్రీ సక్సెస్ ని ముందే నిర్ణయించింది. అలాగే బోయపాటి శ్రీను బాలకృష్ణ 100వ సినిమాకి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఇస్తాడని, బాలయ్య 100వ సినిమా కంటిన్యూగా 1000 రోజులు రన్ అవ్వాలని కోరుకుంటున్నానని’ అన్నాడు.
బాలయ్య తన గురించి అంతలా మాట్లాడిన చంద్రబాబు నాయుడుకి స్పెషల్ థాంక్స్ చెప్పడమే కాకుండా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన అభిమానులకు తన ధన్యవాదాలు తెలిపాడు.

