లీకైన బాలయ్య కొత్త మూవీ లుక్…!

Published on Aug 20, 2019 6:56 am IST

నందమూరి బాలకృష్ణ, కెఎస్ రవికుమార్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి నిర్మాతగా సి.కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

తాజాగా ఈ చిత్ర సెట్స్ నుంచి బయటకు వచ్చిన బాలయ్య లుక్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. గతంలో ఎన్నడూ బాలయ్య చూడని బాలయ్యను దర్శకుడు రవికుమార్ చూపించారు.ఈ ఫొటోలో బాలయ్య లుక్ కంప్లీట్ గా మారిపోయి, స్టైలిష్ గా కనిపించే ఫ్రెంచ్ కట్ గడ్డం లుక్ లో బాలయ్య చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహన్ నటిస్తున్నారు. టైటిల్ నిర్ణియించాల్సి ఉండగా, రూలర్ అనే పేరును పరిశీలిస్తున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం :