నందమూరి నట సింహం బాలకృష్ణ మరోసారి మీసం మేలేస్తున్నాడని సమాచారం. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బాలకృష్ణ నటిస్తున్న తోలి సినిమాలో బాలకృష్ణ కొత్త గెటప్ లో కనిపించానున్నారు. సత్యదేవ దర్శకుడిగా పరిచయం అవుతున్న బాలయ్య 98వ సినిమాలో ఈ నందమూరి హీరో రెండు
విభిన్న గెటప్ లలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. యాక్షన్, కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బాలయ్య బుల్లెట్ లాంటి పవర్ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపిస్తారు. ఈ రోల్ కోసం బాలయ్య మీసం తిప్పుతున్నారు అని టాక్. సోషల్ మీడియాలో బాలయ్య క్లీన్ షేవ్ చేసి మీసం పెంచిన ఫోటో హాల్ చల్ చేస్తుంది. కొత్త సినిమా గెటప్ ఇదే అంటున్నారు.
గతంలో బాలయ్య మీసం మేలేసిన ప్రతిసారి భారి విజయాలను అందుకున్నాడు. ‘సింహ’ సినిమాలో తొలిసారిగా మీసంతో ప్రయోగం చేశారు బాలయ్య. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మీసం తిప్పుతూ కొద్దిగా గడ్డం పెంచిన బాలయ్య మాస్ రఫ్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఇటివలే 100 రోజులు పూర్తి చేసుకున్న ‘లెజెండ్’ సినిమాలోనూ బాలయ్య మీసం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ‘లెజెండ్’ కూడా భారి విజయం సాదించింది. ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ కొత్త సినిమా కోసం కోర మీసం పెంచుతున్నారట.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్. రుద్రపాటి రమణారావు నిర్మాత.


