ప్రముఖ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభిమానులతో కలసి వీధులను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. బాలయ్య వెంట అశేష జనవాహిని తరలి వచ్చింది.
ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తారని ఆశిస్తున్నాను. తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచవలసిన భాద్యత మన అందరి భాద్యత. ఏదో ఒక్క రోజు నిర్వహించే కార్యక్రమం కాదిది. నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ. ప్రతి రోజూ మన పరిసరాలను శుభ్రం చేయాలి. నా అభిమానులు, సన్నిహితులను ఈ క్లీన్ ఇండియా కాంపెయిన్ లో పోల్గోనవలిసిందిగా కోరుతున్నాను. అని అఫీషియల్ పేస్ బుక్ పేజిలో బాలకృష్ణ పేర్కొన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అనేక మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజలను చైతన్యవంతులు చేయడానికి ముందడుగు వేస్తున్నారు.


