మల్టీ స్టారర్ కి రెడీ అవుతున్న బాలకృష్ణ.?

balakrishna-legend
విక్టరీ వెంకటేష్ – అక్కినేని నాగార్జున ఇప్పటికే మల్టీ స్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో వెంకటేష్ ఇప్పటికే మల్టీ స్టారర్ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ లతో కలిసి సినిమాలు చేసిన వెంకటేష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. ఇక ఆ జనరేషన్ హీరోస్ లో మిగిలింది చిరంజీవి, బాలకృష్ణ మాత్రమే..

ప్రస్తుతం చిరంజీవి తన కమ్ బ్యాక్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు అందులో రామ్ చరణ్ కూడా నటించనున్నాడు. ఇక మిగిలింది బాలకృష్ణ.. ఈయన ఇప్పటికే మంచు మనోజ్ తో కలిసి ఓ సారి నటించినప్పటికీ ఆ తర్వాత అలాంటి సినిమాలపై ఆసక్తి చూపలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టాలీవుడ్ కి ఇదొక సుభ సూచకమైన ట్రెండ్ అని చెప్పాలి. దీనివల్ల మరిన్ని కొత్త సినిమాలు, అలాగే నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి ఆదాయాలు తెచ్చి పెడతాయి.

Exit mobile version