
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘లయన్’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన ఓ స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్ లో బాలకృష్ణ పై ఈ రోజు కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ పోలీస్ స్టేషన్ సీన్స్ లో బాలకృష్ణతో పాటు రాధిక ఆప్టే, త్రిష, చలపతి రావులు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
రేపటి నుంచి హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఈ సినిమా షూట్ చేస్తారు. న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ టీజర్ రూపంలో నందమూరి బాలకృష్ణ తన ‘లయన్’ సినిమా ఎలా ఉంటుందా అనేది అభిమానులకు కాస్త సాంపిల్ చూపించాడు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన త్రిషతో పాటు రాధిక ఆప్టే కూడా మరో హీరోయిన్ గా కనిపించనుంది. సత్యదేవా దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మార్చి చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.