బాలకృష్ణ రెండు చిత్రాలను ఒకేసారి మొదలు పెట్టనున్నారు !
Published on Aug 11, 2018 5:24 pm IST


నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ తో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్నాడు. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ ను నవంబర్ కల్లా పూర్తి చేసి చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

ఇక ఈ చిత్రం తరువాత బాలకృష్ణ మరో రెండు చిత్రాలకు కమిట్ అయ్యాడు. దాంట్లో మొదటిది బోయపాటి శ్రీను తెరకెక్కించనున్న చిత్రం కాగా మరొకటి వి వి వినాయక్ దర్శకత్వంలో తెరక్కెనున్న చిత్రం. ఈ రెండు చిత్రాలను ఒకే సారి మొదలు పెట్టనున్నారట బాలకృష్ణ.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook