గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే క్రేజీ కాంబోలో మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపుదిద్దుకుంటోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం NBK111 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి బాలయ్య బర్త్ డే కానుకగా ఓ సాలిడ్ ట్రీట్‌ను మేకర్స్ రెడీ చేస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ అప్‌డేట్‌ను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ‘నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్’ అనే క్యాప్షన్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. జూన్ 10న బాలయ్య సరికొత్త ఊరమాస్ అవతారాన్ని రివీల్ చేయబోతున్నట్లు హింట్ ఇచ్చారు.
ఇక ఈ చిత్రంలో మంచు మనోజ్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు మరియు ఎమోషన్స్‌తో ఈ కథను సిద్ధం చేశాడు. మరి ఈ సినిమా నుంచి రాబోతున్న బాలయ్య నెవర్ బిఫోర్ లుక్ ఎలా ఉండబోతుందా అనేది తెలియాలంటే జూన్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే.


