టార్గెట్ ను రీచ్ అవుతున్న బాలకృష్ణ !

టార్గెట్ ను రీచ్ అవుతున్న బాలకృష్ణ !

Published on Nov 28, 2018 8:21 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. ఈచిత్రాన్ని డిసెంబర్ చివరి కల్లా పూర్తి చేయాలని బాలకృష్ణ టార్గెట్ గా పెట్టుకున్నారట. దాంట్లో భాగంగా ఆయన చిత్రంకోసం నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక అయన పెట్టుకున్న గడువు లోగ ఈచిత్రం యొక్క షూటింగ్ పూర్తి కానుందని సమాచారం.

ప్రస్తుతం ఈ చిత్రంలోని మొదటి భాగం ‘కథానాయకుడు’ చిత్రీకరణ దాదాపుగా పూర్తికావొచ్చింది. ఇక రెండవ భాగం ‘మహానాయకుడు’ చివరి షెడ్యూల్ డిసెంబర్ 25కల్లా పూర్తి కానుందట. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో బాలకృష్ణ కు జోడిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు