నందమూరి బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘ఎన్టీఆర్’ చిత్రం నుండి దర్శకుడు తేజ తప్పుకున్న సంగతి తెలిసిందే. తన అభిమానం నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రకు న్యాయం చేయలేనని భావిస్తూ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్టు తేజ తెలిపారు. దీంతో అట్టహాసంగా మొదలైన ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే ప్రశ్న మొదలైంది.
రాఘవేంద్రరావు, పూరి జగన్నాథ్, కృష్ణ వంశీ వంటి దర్శకుల పేర్లు వినిపించినా ఇప్పుడు బాలక్రిష్ణే స్వయంగా సినిమాను డైరెక్ట్ చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ వార్తపై బాలక్రిష్ణ నుండి గాని, చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి, బాలక్రిష్ణలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిసున్నారు.


