సక్సెస్‌ఫుల్‌గా బాలకృష్ణకు మోకాలి సర్జరీ.. తాజా హెల్త్ బులెటిన్ విడుదల..!

Nandamuri-Balakrishna

హైదరాబాద్‌లోని ఏఐజి ఆస్పత్రిలో నందమూరి బాలకృష్ణకు మోకాలి శస్త్రచికిత్స విజయంవంతంగా ముగిసింది. NBK111 చిత్ర షూటింగ్‌లో ఆయనకు గాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం నాడు ఆస్పత్రి వర్గాలు బాలయ్య ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన అనంతరం మోకాలి సర్జరీ చేయాలని నిర్ణయించింది.

ఈ శస్త్రచికిత్స దాదాపు మూడు గంటలకు పైగా సాగినట్లు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సర్జరీ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఆయనను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

పూర్తిగా కోలుకోవడానికి బాలకృష్ణ కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. బాలయ్య హెల్త్ కండిషన్‌ను బట్టి ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ షెడ్యూల్‌ను కూడా నిర్మాతలు మార్చే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.

Exit mobile version