ఆహా వీడియో లో బాలయ్య ఎపిసొడ్ కి టైమ్ ఫిక్స్!

Published on Jun 1, 2022 10:00 pm IST

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం లోని సెమీ ఫైనల్స్ కి నందమూరి బాలకృష్ణ స్పెషల్ గెస్ట్ గా వచ్చి అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఈ అన్ స్టాపబుల్ వీడియో ను జూన్ 10, రాత్రి 9 గంటలకు ప్రసారం చేయనున్నట్లు తాజాగా ఆహా వీడియో వెల్లడించడం జరిగింది.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో మాస్ ఎంటర్ టైనర్ కి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా ఆహా వీడియో లోని కార్యక్రమాలతో బాలయ్య ప్రేక్షకులను అలరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :