అన్‌స్టాపబుల్ ప్రోమో: దెబ్బకి థింకింగ్ మారిపోవాలంటున్న బాలయ్య..!

Published on Oct 27, 2021 6:24 pm IST

నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ నిర్మాణంలో నవంబర్ 4వ తేది నుంచి ప్రసారం కానున్న ఈ షో మొత్తం 12 ఎపిసోడ్‌లుగా స్ట్రీమింగ్ కానుంది. అయితే తాజాగా ఈ టాక్ షోకి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది.

ప్రోమో విషయానికి వస్తే ‘నీకు చిత్త శుద్ధి ఉన్నప్పుడు.. నీకు లక్ష్య శుద్ధి ఉన్నప్పుడు.. నీకు సంకల్ప శుద్ధి ఉన్నప్పుడు.. నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవంటూ.. మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్‌ ఉండదు, ‘సై అంటే సై.. నై అంటే నై’.. దెబ్బకి థింకింగ్ మారిపోవాల అంటూ బాలయ్య తనదైన స్టైల్‌లో చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రోమోలో బాలయ్య స్టన్నింగ్ లుక్స్‌, స్టైల్‌ కూడా అభిమానులకు విపరీతంగా నచ్చేలా ఉన్నాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More